యోయో టెస్టు గురించి కోహ్లీని అడిగిన మోదీ

భారతీయులంతా ఫిట్‌గా ఉండి ధృఢ భారతదేశం ఏర్పాటు లక్ష్యంగా గతేడాది ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ధృఢ భారత్‌ ఉద్యమం గురువారంతో

Published : 24 Sep 2020 18:16 IST

దృఢ భారత్‌ ఉద్యమానికి ఏడాది

న్యూదిల్లీ: భారతీయులంతా ఫిట్‌గా ఉండి దృఢ భారతదేశం ఏర్పాటు లక్ష్యంగా గతేడాది ప్రధాని మోదీ పిలుపునిచ్చిన దృఢ భారత్‌ ఉద్యమం గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు ప్రముఖులు, క్రీడాకారులు, ఫిటెనెస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వారితో ఫిట్‌ ఇండియా నినాదం 2020 పేరుతో వర్చువల్‌ వేదికగా మాట్లాడారు. ఆయన ఆహారపు అలవాట్లను పంచుకున్నారు. పోషకాహారం నిపుణులు రిజుతా దివాకర్‌తో మాట్లాడే సమయంలో ప్రధాని మోదీ పసుపును ఆహారంలో భాగంగా తీసుకుంటానని వివరించారు. తన మాతృమూర్తితో వారానికి రెండుసార్లు మాట్లాడటానికి ప్రయత్నిస్తానని చెప్పిన మోదీ.. తన తల్లి ప్రతిసారీ ఆహారంలో పసుపు వాడుతున్నావా లేదా అని అడుగుతారని వివరించారు.

యోయో టెస్టు గురించి కోహ్లీని అడిగిన మోదీ..

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కూడా ప్రధాని మోదీ ముచ్చటించారు. క్రికెట్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి యోయో టెస్టు గురించి చెప్పమని విరాట్‌ను అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానం చెప్పిన కోహ్లి యోయో టెస్టు ఆటగాళ్లలోని అత్యుత్తమ ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తుందని తెలిపారు. టెస్టు గురించి వివరిస్తూ.. ఆటగాడు 20 మీటర్ల దూరం మధ్యలో ఉంచిన లక్ష్యాలను బీప్‌ శబ్దాలను ఆధారంగా ఛేదించాలని తెలిపారు. తన దినచర్యలో వ్యాయామం భాగమైందని చెప్పిన కోహ్లీ ప్రతి ఒక్కరిలో ఫిట్‌నెస్‌ సంస్కృతి అలవడాలని పేర్కొన్నారు. తరాలుగా వచ్చే సంప్రదాయ ఆహారం తీసుకొని మన ప్రాచీనులు ఆరోగ్యవంతంగా ఉన్నారని కోహ్లీ అన్నారు. ప్రస్తుతం అటువంటి ఆహారం తినటం మానేసి బయటి తిండికి అలవాటు పడటంతో ఫిట్‌నెస్‌ స్థాయులు దారుణంగా పడిపోయాయని వివరించారు.  

మానసిక దృఢత్వం అవసరం

ప్రజలు ఫిట్‌గా ఉండే దేశం ఏ సమస్యనైనా ఎదుర్కోగలదని మోదీ వివరించారు. శరీరం దృఢత్వంతో పాటు మానసికంగా దృఢంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వయసుల వారీగా ఎటువంటి ఫిట్‌నెస్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవాలో ప్రధాని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులు పాల్గొన్నారు.  ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం సంతరించుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు