Andhra News: ఆలయాల్లో ‘టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టం’ ద్వారా ఆన్‌లైన్‌ సేవలు: కొట్టు సత్యనారాయణ

వచ్చే ఏడాది జనవరి 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 175 దేవాలయాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని ష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Updated : 14 Dec 2022 20:45 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో త్వరలోనే టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 175 దేవాలయాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. దర్శన టికెట్లు, పూజలు, కానుకలు తదితర సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 16 దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలోని మరో 185 దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల పథకం మంజూరు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. అలాగే ఆలయాలకు వచ్చే ఆదాయం, వ్యయాలు, ఇతర రాబడులపైనా పటిష్టమైన ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని