Asteroid Bennu: 2300 సంవత్సరంలో భూమిని తాకనుంది: నాసా

అంతరిక్ష పరిశోధనల్లో అపార అనుభవం కలిగిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా..  భూమిని

Published : 13 Aug 2021 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్ష పరిశోధనల్లో అపార అనుభవం కలిగిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా..  భూమిని ఢీకొట్టేందుకు ఓ గ్రహశకలం వస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు కొన్నేళ్ల కిందట సంచలనంగా మారాయి. కాగా 2200లో భూమిని బెన్ను అనే గ్రహశకలం ఢీకొట్టే అవకాశం ఉందని నాసా ప్రకటించింది. ఈ క్రమంలో బెన్ను గ్రహశకల కదలికలను అంచనా వేసేందుకు నాసా ప్రయోగించిన ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌక కీలక విషయాలను బయటపెట్టింది.

బెన్ను గ్రహశకలంపై పరిశోధన ప్రారంభించిన నాసా మొదటిలో 2182 సెప్టెంబర్‌ 24న ఢీకొడుతుందని అంచనా వేస్తూ ఆరోజును భయంకరమైన రోజుగా అభివర్ణించింది. తాజాగా ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌక బెన్ను గ్రహశకలం తిరుగుతున్న కక్ష్యను అంచనా వేయడం ద్వారా అది 2300 సంవత్సరంలో భూమిని తాకే అవకాశం ఉందని నాసా నిర్ణయానికి వచ్చింది. 2135 సవంత్సరంలో బెన్ను గ్రహశకలం భూమికి, చంద్రుడికి మధ్యగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.  ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌక ఇచ్చిన సమాచారం అధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు నాసా పేర్కొంది. 

2016 నుంచి నాసా బెన్ను గ్రహశకలంపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంలో నాసా ఆ ఏడాదిలో ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌకను  ప్రయోగించింది. ఇది నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2020 అక్టోబర్‌ 21న  విజయవంతంగా బెన్ను గ్రహశకలంపై దిగింది. అప్పటి నుంచి గ్రహశకలంపై ఉన్న నమూనాలను సేకరిస్తూ గ్రహ కదలికల్ని అంచనా వేస్తోంది. బెన్ను గ్రహశకలం భూమికి సుమారు 29.3 కోట్ల కి.మీ. దూరంలో ఉందని, ఇది భూమికి అంగారకుడికి మధ్య ఉన్న దూరంతో సమానమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఆరేళ్లకు ఒక సారి భూమికి దగ్గరగా వస్తున్నట్లు పేర్కొన్నారు. ఒసైరిస్ -రెక్స్ వ్యోమనౌక నుంచి సేకరించిన నమూనాలు 2023లో భూమికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు ఇదివరకే ప్రకటించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని