Andhra news: ధర్మారెడ్డి, విజయ్‌ కుమార్‌రెడ్డిలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌రెడ్డిపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

Updated : 10 Jul 2024 21:53 IST

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌రెడ్డిపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ధర్మారెడ్డి, విజయ్‌ కుమార్‌రెడ్డిల పదవీ కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డిపై తెదేపా నేతలు ఫిర్యాదు చేయగా.. విజయ్‌ కుమార్‌రెడ్డిపై జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదులిచ్చాయి.

ఇటీవలే ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయగా, కేంద్రంలో చేరేందుకు దిల్లీకి వెళ్లిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెనక్కు వచ్చారు. దర్యాప్తులో భాగంగా వారి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులనూ విచారణ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవాణి టిక్కెట్లలో అక్రమాలకు పాల్పడ్డారని తితిదేని అడ్డం పెట్టుకుని వైకాపాకు విరాళాలు సేకరించారని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ధర్మారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. సమాచార శాఖలో ప్రకటనల పేరిట కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని విజయ్ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని