ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేశారా.. ఐతే ఇది చూడండి!

ఆన్‌లైన్‌ డెలివరీదాగి ఉన్న మరో విధమైన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Updated : 06 Dec 2022 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తమ అలవాట్లు, జీవన విధానం అన్నిటినీ మార్చుకుంటున్నారు. ఇదివరకు గంటలు గంటలు షాపింగ్‌ చేసే వారుకూడా.. తమ అవసరాలకు ఆన్‌లైన్‌ డెలివరీని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇందులో దాగి ఉన్న మరో విధమైన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

దీనిలో డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన ఓ మహిళ.. సదరు వస్తువును వినియోగదారుకు అందచేసినందుకు రుజువుగా దానిని ఇంటి ముందు భాగంలో కిందపెట్టి తన ఫోన్‌లో ఓ చిత్రాన్ని తీసుకుంది. అనంతరం దానిని తానే తీసుకుని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. కాగా అక్కడ ఉన్న సీసీ టీవీ కెమేరాలో ఈ సంఘటన అంతా నమోదయింది. ఇది సామాజిక మాధ్యమాల్లో షేర్‌ కావటంతో దీనిని చూసిన వారు.. ‘‘సీసీ టీవీ కెమేరాలు అంటూ ఒకటి ఉంటాయని నీకు తెలియదా.. నీ ఉద్యోగం ఊడింది.. ఇదేం బాలేదు.. సరిగ్గా టిప్‌ ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు..’’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఆ సంగతేంటో మీరూ చూసేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు