POTUS.. FLOTUS.. DOTUS.. ఎలా వచ్చాయ్!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి.. అధికార మార్పిడి జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌పైనే ఉంది. జనవరి 20న బైడెన్ అధికారికంగా అమెరికా అధ్యక్షుడవుతారు. అయితే, సాధారణంగా అందరూ అమెరికా అధ్యక్షుడిని
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి.. అధికార మార్పిడి జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌పైనే ఉంది. జనవరి 20న బైడెన్ అధికారికంగా అమెరికా అధ్యక్షుడవుతారు. అయితే, సాధారణంగా అందరూ అమెరికా అధ్యక్షుడిని ‘మిస్టర్ ప్రెసిడెంట్’ అని పిలుస్తుంటారు. అదే సమయంలో అధ్యక్షుడిని ‘పోటస్’ (POTUS) అనీ.. ఆయన సతీమణి, తొలి మహిళను ‘ఫ్లోటస్’ (FLOTUS) అని పిలవడం గమనించే ఉంటారు. తాజాగా బైడెన్ కుటుంబం పెంచుకునే శునకాలు వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్నాయి. వాటిని డోటస్ (DOTUS) అని పిలుస్తున్నారు. ఇంతకీ ఏమిటీ పోటస్, ఫ్లోటస్, డోటస్? వీటి అర్థం ఏంటి? ఈ పదాలు ఎలా వచ్చాయి?
పోటస్ (POTUS) అంటే ‘ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్’కు సంక్షిప్త నామం. ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్’ను ఫ్లోటస్ (FLOTUS) అంటారు. వీటి సృష్టికి మూల కారకుడు వాల్టర్ పి. ఫిలిప్స్. 1846లో అమెరికాలో జన్మించిన ఆయన జర్నలిస్టుగా, టెలీగ్రాఫ్ ఆపరేటర్‌గా అమెరికా మీడియాలో పనిచేశారు. వివిధ ప్రాంతాల నుంచి టెలీగ్రాఫ్, షార్ట్‌హ్యాండ్ రైటింగ్, కోడ్స్ ద్వారా వార్తలను సేకరించేవారు. ఈ క్రమంలో 1879లో ఫిలిప్స్ సొంతగా ది ఫిలిప్స్ కోడ్‌ను రూపొందించారు. వార్తల్లో తరచూ ఉపయోగించే పదాలను సంక్షిప్త పదాలుగా మార్చి ప్రత్యేక కోడ్స్ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. అందులో అమెరికా సుప్రీంకోర్టును ‘స్కోటస్ (SCOTUS- సుప్రీంకోర్టు ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్)’గా పేర్కొన్నారు. ఇక వివిధ దేశాల అధ్యక్షుల ప్రస్తావన వచ్చినప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్ అని అనాల్సిన చోట ‘POT-ప్రెసిడెంట్ ఆఫ్ ది’ అనే సంక్షిప్త పదాన్ని వాడారు.
విలేకరుల సమయం, శక్తి వృథా కాకుండా.. తొందరగా వార్తలు అందించేందుకు ఫిలిప్స్ కోడ్ ఉపయుక్తంగా మారింది. అలా 1895 నుంచి అమెరికా అధ్యక్షుడిని పోటస్ (ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్) అనే సంక్షిప్త పదంతో సంభోదించడం ప్రారంభమైంది. అధికారికంగా ఈ పదాన్ని 1923లో విడుదల చేసిన ఫిలిప్స్ కోడ్ ఎడిషన్‌లో జోడించారు. దీంతో అప్పటి మీడియాలో పోటస్ అనే పదం పాపులరైంది. వార్తల చేరవేతలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా ఆ పదాన్ని కొనసాగించారు. 1940ల్లో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ పంపిన అంతర్జాతీయ టెలీగ్రాఫ్ రికార్డులపై పోటస్ అనే ఉండేది. 1960లో సీక్రెట్ సర్వీస్ వ్యవస్థలోనూ ఈ పదం చేరింది. 1966లో లిండన్ బి. జాన్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఆయనకు ఫోన్ చేయడం కోసం సెక్రెటరీ వద్ద ఉండే ఫోన్‌లో పోటస్ పేరుతో ప్రత్యేక బటన్ కూడా ఉండేదట. 1980ల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సతీమణి.. దేశ తొలి మహిళను సంక్షిప్తంగా ‘ఫ్లోటస్ (FLOTUS- ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్)’ అని పిలవడం మొదలుపెట్టారు. వైస్ ప్రెసిడెంట్‌ను ‘విపోటస్’ అని.. దేశ రెండో మహిళను ‘విఫ్లోటస్’ అని పిలుస్తున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడయ్యాక తన ట్విటర్ ఖాతాలో ‘పోటస్’ అని పేర్కొనడంతో ఈ సంక్షిప్త పదాలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. ఇప్పుడు జో బైడెన్ పెంచుకుంటున్న ఛాంప్, మేజర్ అనే రెండు శునకాలు వైట్‌హౌస్‌లో నివసించబోతుండటంతో వాటిని డోటస్ (DOTUS- డాగ్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్)గా పిలుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం