Spiders: ఆ పార్శిల్‌లో 107 సాలె పురుగులు

పోలాండ్‌ నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను తెరిచి చూసిన కస్టమ్స్‌ అధికారులు.. అందులో వందకు పైగా సాలెపురుగులు ఉండటం చూసి ఖంగుతిన్నారు. పోలాండ్‌ నుంచి చెన్నై విమానాశ్రయంలోని విదేశీ పోస్టాఫీసుకు ఓ పార్శిల్‌ వచ్చింది....

Published : 03 Jul 2021 01:06 IST

చెన్నై: పోలాండ్‌ నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను తెరిచి చూసిన కస్టమ్స్‌ అధికారులు.. అందులో వందకు పైగా సాలె పురుగులు ఉండటం చూసి ఖంగుతిన్నారు. పోలాండ్‌ నుంచి చెన్నై విమానాశ్రయంలోని విదేశీ పోస్టాఫీసుకు ఓ పార్శిల్‌ వచ్చింది. అది తమిళనాడులోని అరుపుకొటాయ్‌కి చెందిన ఓ వ్యక్తి పేరుమీద వచ్చిది. ఆ పార్శిల్‌ను విప్పి చూడగా అందులో 107 సాలె పురుగులను గుర్తించినట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. థర్మాకోల్‌ పెట్టెలో మొత్తం 107 ప్లాస్టిక్‌ వయల్స్‌లో వాటిని భద్రంగా ఉంచి పంపినట్లు తెలుస్తోంది. ప్రతి వయల్‌లోని సాలెపురుగు బతికే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) అధికారులు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎస్‌ఆర్‌సీ) శాస్త్రవేత్తలను పిలిపించి వాటి గురించి మరింత సమాచారం సేకరించారు. ఆ జీవుల్ని ఫోనోపెల్మా, బ్రాచిపెల్మా జాతులకు చెందిన ఈ సాలె పురుగులుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దక్షిణ, మధ్య అమెరికాతోపాటు మెక్సికోలో ఇవి కనిపిస్తాయని వారు తెలిపారు. వీటి దిగుమతికి సంబంధించి డీజీఎఫ్‌టీ లైసెన్స్‌, తదితర పత్రాలు లేనందున.. ఇది దిగుమతి చట్ట విరుద్ధమని అధికారులు వెల్లడించారు. విదేశీ వాణిజ్య చట్టం 1962 కింద అధికారులు ఆ సాలె పురుగులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ పార్శిల్‌ను పోలెండ్‌కు తరలించాని నిశ్చయించి పోస్టల్‌ అధికారులకు అప్పగించారు. అయితే వాటిని ఎవరు దిగుమతి చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నారు? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టినట్లు విమాశ్రయ అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని