Tiger cubs: బాంధవ్‌గఢ్‌లో పులి పిల్లల సందడి

మధ్యప్రదేశ్‌లోని అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రం బాంధవ్‌గఢ్‌లో పులి పిల్లల సందడి నెలకొంది. ఏడాది లోపు వయసున్న 41 పులి పిల్లలను గుర్తించినట్లు అటవీ శాఖ సీనియర్‌ అధికారి

Published : 29 May 2021 23:53 IST

ఏడాది వయసున్న 41 పులి పిల్లల గుర్తింపు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రం బాంధవ్‌గఢ్‌లో పులి పిల్లల సందడి నెలకొంది. ఏడాది లోపు వయసున్న 41 పులి పిల్లలను గుర్తించినట్లు అటవీ శాఖ సీనియర్‌ అధికారి అలోక్‌ కుమార్‌ తెలిపారు. సంరక్షణ కేంద్రంలో అమర్చిన కెమెరాల సాయంతో వీటి లెక్క తేల్చినట్లు పేర్కొన్నారు. పులుల సంఖ్యపై సిబ్బంది విశ్లేషించిన లెక్కల ప్రకారం కల్లావా, పటోర్‌, తలా, ధమకోర్‌, పెన్‌పథా, భాన్‌పుర్‌, మఘ్డీ, ఖితౌలీ బీట్‌లలో వీటిని గుర్తించినట్టు వివరించారు. ఎక్కువ సంఖ్యలో పులుల పుట్టినిల్లుగా బాంధవ్‌గఢ్‌కు పేరుంది. ఇక్కడ పుట్టిన చాలా పులులు పెరిగి పెద్దయ్యాక రాష్ట్ర సరిహద్దులు సైతం దాటి పలు ప్రదేశాలకు వెళ్తుంటాయి. 716 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన బాంధవ్‌గఢ్‌ను 1968లో జాతీయ పార్కుగా కేంద్రం గుర్తించింది. అనంతరం 1993లో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని