Food Poison: కలుషిత ప్రసాదం తిని 50 మందికి పైగా అస్వస్థత

తిరుపతి జిల్లా కేవీబి పురం మండలం ఆరె గ్రామంలో కలుషిత ప్రసాదం తిని 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

Updated : 19 Sep 2023 06:13 IST

కేవీబీపురం: తిరుపతి జిల్లా కేవీబిపురం మండలం ఆరె గ్రామంలో కలుషిత ప్రసాదం తిని 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం గ్రామంలోని ఆలయ ప్రసాదాన్ని నిర్వాహకులు గ్రామస్థులకు పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న తర్వాత గ్రామస్థులు అతిసారానికి గురయ్యారు. దీంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కేవీబీపురం ఆస్పత్రిలో 30 మంది చికిత్స పొందుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని