ప్రముఖ నృత్యకారుడు సునీల్‌ కొఠారీ మృతి

పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నృత్యకారుడు సునీల్‌ కొఠారీ ఆదివారం మరణించారు. గతనెల కరోనా వైరస్‌ బారిన పడిన కొఠారీ.. ఈరోజు అకస్మాత్తుగా గుండెపోటు సంభవించడంతో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.

Published : 27 Dec 2020 16:31 IST

కుడి వైపున ఉన్న వ్యక్తి 

దిల్లీ: పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నృత్యకారుడు సునీల్‌ కొఠారీ ఆదివారం మరణించారు. గతనెల కరోనా వైరస్‌ బారిన పడిన కొఠారీ.. ఈరోజు అకస్మాత్తుగా గుండెపోటు సంభవించడంతో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన సన్నిహితురాలు విధాలాల్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘దాదాపు నెల కిందట కొఠారీ కొవిడ్‌ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు’ అని వెల్లడించారు. 

కొఠారీ.. 1933 డిసెంబర్‌ 20న జన్మించారు. తొలుత ఆయన ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా అర్హత సాధించినప్పటికీ.. తనకున్న ఆసక్తి మేరకు భారతీయ నృత్యకళల వైపు మళ్లారు. భారతీయ నృత్య కళలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలను రాశారు. నృత్య విభాగంలో ఆయన చేసిన సేవలకు గానూ కొఠారీ ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను గౌరవించింది. 1995లో సంగీత్‌ నాటక్‌ అకాడమీ అవార్డు సైతం అందుకున్నారు. 

ఇదీ చదవండి

భాజపాలోకి వెళ్లిన నేతలకు నిరసనల సెగ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని