Hassanabad Bridge: కళ్ల ముందే కూలిన వంతెన.. వైరల్‌ అవుతున్న వీడియో...

వేసవి కారణంగా ఏర్పడిన వేడి గాలులకు హిమనీనదాలు కరిగి వరదలు ఏర్పడ్డాయి. ఆ వరద తాకిడికి చారిత్రక వంతెన నేలకూలిపోయింది.  దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

Updated : 11 May 2022 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేసవి కారణంగా ఏర్పడిన వేడి గాలులకు హిమనీనదాలు కరిగి వరదలు ఏర్పడ్డాయి. ఆ వరద తాకిడికి చారిత్రక వంతెన నేలకూలిపోయింది.  దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇది ఎక్కడో అనుకోకండి పాక్‌ఆక్రమిత కశ్మీర్‌లో  జరిగిన ఈ ఘటన వైరల్‌ అయ్యింది. హసనాబాద్‌ వంతెన శనివారం కూలిపోయింది. గిల్గిట్‌ - బాల్టిస్థాన్‌ ప్రాంతంలో ఉన్న ఈ వంతెన వరద నీటిలో కొట్టుకుపోయింది. వేల మంది స్థానికులు, పర్యాటకులు ఆ వరదల్లో చిక్కుకు పోయారు.

కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌ మంత్రి షెర్రీ రెహ్మాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘పాకిస్థాన్‌ ఉత్తర భాగంలోని మౌంట్‌ షిప్పర్‌ సమీపంలో ఉన్న హిమనీనదాలు కరుగుతున్న కారణంగా ఈ హైవేపై ఉన్న వంతెన కూలిపోయింది’ అని ఆమె పేర్కొన్నారు. ఈ వరదల కారణంగా రెండు జల విద్యుత్తు ప్రాజెక్టులు, కొన్ని వందల ఇళ్లు, వ్యవసాయ భూములు అన్ని నీట మునిగాయి. త్వరలోనే తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేస్తామని స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ సంవత్సరం ఏప్రిల్‌లో పాకిస్థాన్‌లో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దశాబ్దకాలంగా ఎప్పూడూ లేనంతగా ఈ ఏప్రిల్‌లో 49 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో దానిని హాటెస్ట్‌ ఏప్రిల్‌గా పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని