పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. బకెట్లతో ఎగబడిన స్థానికులు

పల్నాడు జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Updated : 19 Jun 2024 10:33 IST

రాజుపాలెం: పల్నాడు జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై పామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్యాంకర్‌ బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్‌ నుంచి పామాయిల్‌ తీసుకెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్‌ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని