Yadadri: యాదాద్రిలో మహాక్రతువుకు అంకురార్పణ.. ఆలయ ఉద్ఘాటన ప్రక్రియకు శ్రీకారం

యాదాద్రిలో మహాక్రతువుకు అంకురార్పణ జరిగింది. పంచ నారసింహ ఆలయ ఉద్ఘాటన ప్రక్రియకు అర్చకులు శ్రీకారం చుట్టారు.

Updated : 21 Mar 2022 15:40 IST

యాదగిరిగుట్ట: యాదాద్రిలో మహాక్రతువుకు అంకురార్పణ జరిగింది. పంచ నారసింహ ఆలయ ఉద్ఘాటన ప్రక్రియకు అర్చకులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. దీనిలో భాగంగా పంచ కుండాత్మక మహాయాగానికి అంకురార్పణ చేపట్టారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. బాలాలయంలోని యాగశాలలో పంచకుండాలతో యాగాన్ని ప్రారంభించారు. నారసింహుని జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని తొలి పూజలకు తెరతీశారు.

పంచ కుండాత్మక మహాయాగంలో భాగంగా బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని మహారాజాభిషేకంగా చేపట్టనున్నారు. దీనికోసం 108 కలశాలను అలంకరించి, 108 దేవతారాధనలు జరిపి విశిష్ట అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం ప్రారంభమైన పుణ్యాహవచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, వాస్తు ఆరాధనలను మధ్యాహ్నం వరకు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మృత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన, అష్టదిక్పాలకుల ప్రతిష్ఠాపర్వం చేపడతారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని