Published : 11 Aug 2022 01:41 IST

Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: భోజనం చేసిన వెంటనే పొట్టలో నొప్పి వస్తుంటే ఆజీర్తి చేసిందనుకుంటాం..ఆ బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ అది ఎంతకూ తగ్గదు. ఇక బొడ్డు పైభాగాన నొప్పి వస్తే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లకపోతే ఇబ్బందులు రావొచ్చు. క్లోమగ్రంథికి వాపు వచ్చినపుడు ఈ సమస్య వస్తుంది. నొప్పి నివారణ మందులను వాడుతూ పోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు చంద్రశేఖర్‌ పులి పేర్కొన్నారు.

క్లోమగ్రంధి ఏం చేస్తుందంటే..: మనం తిన్న ఆహారం జీర్ణం చేయడంతో పాటు ఇన్సులిన్‌ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఏ కారణంతోనైనా క్లోమగ్రంథి నాళంలో ఇబ్బందులు ఎదురయితే  క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. ఇలాంటప్పుడు క్లోమగ్రంథికి వాపు వస్తుంది. చివరికి తనకు తానే జీర్ణం అయిపోతుంది. 

ఎలా వస్తుందంటే..:ఆల్కాహాల్‌, సిగరెట్‌ తాగేవారు, స్టెరాయిడ్స్‌ వాడేవాళ్లకు ఎక్కువగా వస్తుంది. వారసత్వంగా కూడా రావొచ్చు. బరువు బాగా తగ్గిపోతారు. మలం దుర్వాసన వస్తుంది. విరేచనాలు ఎక్కువగా అవుతాయి. కామెర్లు కూడా వస్తాయి. 

చికిత్స ఎలా ఉంటుంది: రక్త పరీక్ష, సిటీ స్కాన్‌,ఎండోస్కోపీ చేసినపుడు నిర్ధారణ చేయవచ్చు. కొంతమందికి రాళ్లు కూడా వస్తాయి. కారణం తెలుసుకొని చికిత్స చేయాల్సి ఉంటుంది. మందులతో తగ్గకపోతే క్లోమంలో స్టంట్‌ వేయాలి. 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని