Lifestyle: పిల్లలతో ప్రయాణాలా.. ఈ జాగ్రత్తలు పాటించండి!
పిల్లలతో ప్రయాణాలు చేస్తున్నారా! అయితే మీ బ్యాగులో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే! అవేంటో చూడండి!
Published : 28 Oct 2022 10:21 IST
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలతో ప్రయాణాలు చేస్తున్నారా! అయితే మీ బ్యాగులో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే! అవేంటో మీరే చదవండి..
- కాస్త వాతావరణంలో మార్పులు వస్తే చాలు పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరాలు మొదలవుతాయి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, పిల్లలకు వాడే మందులు అన్నింటినీ వెంట తీసుకువెళ్లాలి.
- వాటర్ బాటిల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. పిల్లలైనా, పెద్దవాళ్లైనా గంటకోసారి నీళ్లు తాగుతూ ఉండాలి.
- పిల్లలు ఎప్పుడు ఆకలి అంటారో తెలియదు. అందుకే బ్యాగులో ఎప్పుడూ స్నాక్స్ వెంట ఉంచుకోవాలి. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇంట్లో వండిన ఆహారం వెంట తీసుకెళ్లడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల బయటి ఆహారానికి దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
- ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాసేపటికి ముఖం పైన జిడ్డు పేరుకుపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే వెట్ వైప్స్ వెంట ఉంచుకోవాలి. ఇవి పిల్లలు, పెద్దలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి.
- బ్యాగులో తప్పనిసరిగా శానిటైజర్ ఉండాలి. ఏదోక పని చేస్తూ ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటారు. అదే చేతులతో ముఖాన్నితాకుతుంటారు. అందువల్ల దేనినైనా ముట్టుకున్నప్పుడు శానిటైజర్ రాసుకోవాలి.
- దూర ప్రాంతాలకు వెళ్లినపుడు కచ్చితంగా స్వెటర్లు, బెడ్షీట్లు వెంట తీసుకెళ్లాలి. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో తెలియదు. కాబట్టి ఎక్కడికి వెళ్లినా బ్యాగులో వీటిని తీసుకెళ్లడం ఉత్తమం.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్’పై పార్లమెంట్లో రగడ.. ఉభయ సభలు రేపటికి వాయిదా
-
Movies News
Director Sagar: ‘స్టూవర్ట్‌పురం దొంగలు’ తీసి చిరంజీవిని కలవలేకపోయిన దర్శకుడు సాగర్
-
India News
Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్‌పై విడుదల
-
India News
‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Kadapa: కడప నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణహత్య