Tirumala: తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుమలలో పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు.  అనంతరం స్వామివారు హత్తీరాంజీ వారి బెత్తం తీసుకొని సన్నిధిలోకి వెళ్లారు.

Published : 16 Jan 2023 19:59 IST

తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఒక తిరుచ్చిలో శ్రీమలయప్ప స్వామి, మరో తిరుచ్చిలో శ్రీకృష్ణ స్వామి వేంచేయగా.. పార్వేట మండపంలో పుణ్యాహము, ఆరాధన, నివేదన హారతులిచ్చారు. అనంతరం శ్రీ కృష్టస్వామివారిని సన్నిధి యాద‌వ పూజ చేసిన చోటుకు తీసుకెళ్లి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. ఆ తర్వాత శ్రీ మలయప్పస్వామివారు కొంత దూరము పరుగెత్తగా.. ఆయన తరపున అర్చకులు బాణమువేసిన తర్వాత వెనక్కి వచ్చారు. ఇలా మూడుసార్లు చేశారు. ఉత్సవం పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు మహాద్వారమునకు వచ్చి హతీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వెళ్లారు. ఇంతటితో పార్వేట ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవంలో జెఈఓ వీరబ్రహ్మం, ఎస్ ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, డిఇ రవి శంకర్ రెడ్డి, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ శ్రీదేవి డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, వీజివోలు బాలిరెడ్డి, గిరిధర్, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని