కరోనా దరి చేరకూడదని రావి చెట్టు కిందకు..

ఉత్తరప్రదేశ్‌లోని నౌబరీ గ్రామ వాసులు రావి చెట్టు కింద మకాం వేశారు. ఉదయం, సాయంత్రం ఆ చెట్టు కిందే యోగా చేస్తున్నారు. కొంత మంది ఏకంగా అక్కడే నివాసాలు ఏర్పరుచుకున్నారు....

Updated : 22 Dec 2022 14:41 IST

ఆగ్రా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నౌబరీ గ్రామ వాసులు రావి చెట్టు కింద మకాం వేశారు. ఉదయం, సాయంత్రం ఆ చెట్టు కిందే యోగా చేస్తున్నారు. కొంత మంది ఏకంగా అక్కడే నివాసాలు ఏర్పరుచుకున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సమస్యలు రాకూడదని రావి చెట్టు నీడనే సేద తీరుతున్నారు. 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. శ్వాస వ్యవస్థపై దాడి చేయడం వ్యాధి ప్రధాన లక్షణం. కరోనా రెండో దశలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోవడం వల్ల అనేక మంది మృతి చెందుతున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా నౌబరీ గ్రామవాసులు ఆక్సిజన్‌ కోసం స్థానిక రావి చెట్టు కిందకు చేరుతున్నారు. అక్కడే తాత్కాలిక నివాసాలు కూడా ఏర్పరుచుకుంటున్నారు. అంతేకాదు.. దీని కిందే యోగా, వ్యాయామాలు చేస్తున్నారు. అందుకు ఓ యోగా గురువు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారికి ఉదయం, సాయంత్రం యోగా నేర్పిస్తున్నారు. 

రావి చెట్టు ఆక్సిజన్‌ను నిరంతరం అందిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన రావిచెట్టు శ్వాసకోశ సమస్యలను నివారించే దివ్యౌషధం. పురాతన, బౌద్ధ కాలం నుంచే ఈ చెట్టుకు ఆధ్యాత్మికంగా, వైద్య పరంగా ఎంతో విశిష్టత ఉంది. రావి చెట్టు కింద కూర్చుంటే ఆక్సిజన్‌ కొరత సమస్యలు రావని వారి నమ్మకం. కొవిడ్‌ సోకినవారు చాలా మంది ఇక్కడికి వస్తున్నారని.. అయినా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందడం లేదని అక్కడికి వెళ్లేవారు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని