Pawan Kalyan: విజయవాడలో క్యాంపు కార్యాలయం.. పరిశీలించిన పవన్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు

Updated : 18 Jun 2024 16:20 IST

విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన పరిశీలించి అంగీకారం తెలిపారు. ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడలోని జలవనరులశాఖ అతిథిగృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎంకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి ఆ భవనాన్ని పవన్‌ పరిశీలించారు. పైఅంతస్తులో నివాసం.. కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశమందిరం అందుబాటులో ఉండటంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్‌ అంగీకరించినట్లు సమాచారం. అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం సచివాలయంలో తన పేషీని పవన్‌ పరిశీలించనున్నారు. మరోవైపు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి ప్రాంత రైతులు సిద్ధమయ్యారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని