pawan Kalyan: నేను పరాజయం పొందిన రాజకీయ నేతను: పవన్‌ కల్యాణ్‌

తాను పరాజయం పొందిన రాజకీయ నాయకుడినని, ఓడిపోయానని చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సదస్సులో ఆయన పాల్గొన్నారు.

Published : 03 Dec 2022 20:09 IST

హైదరాబాద్‌: తాను పరాజయం పొందిన రాజకీయ నాయకుడినని, ఓడిపోయానని చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సదస్సులో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఫేసింగ్‌ ది ప్యూచర్‌’ అంశంపై  సీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘నా పరాజయాల గురించి నిర్భయంగా మాట్లాడుతా. పరాజయంలోనే జయం ఉటుంది. డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు, పేరున్న వాళ్లంతా మహానుభావులు అనుకోవద్దు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మొద్దు. దేవుడిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవాలి. మన వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి’’ అని పవన్‌ కల్యాణ్ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని