PawanKalyan: బాలిక మిస్సింగ్ కేసు.. చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ ఆదేశం

ఓ మిస్సింగ్‌ కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ స్పందించారు. 

Updated : 22 Jun 2024 19:11 IST

విజయవాడ: ఓ మిస్సింగ్‌ కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ స్పందించారు. తమ కుమార్తె అదృశ్యంపై ఓ మహిళ.. పవన్‌ను కలిసి మొరపెట్టుకుంది. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్‌ అని, ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసి కిడ్నాప్‌ చేశారని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి వచ్చిన శివకుమారి కన్నీటి పర్యంతమైంది. మాచవరం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వాపోయింది. దీనిపై వెంటనే స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. మాచవరం సీఐకి ఫోన్‌ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనసేన నాయకులు, బాధితులను మాచవరం పోలీస్‌ స్టేషన్‌కు పంపించారు. బాధితులకు అండగా ఉండాలని నేతలకు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని