Pawan Kalyan: పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలి: పవన్‌కల్యాణ్‌

ఎంతోమంది పోరాటయోధుల ప్రాణ త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. అలాంటి త్యాగధనులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు.

Updated : 02 Jun 2023 09:26 IST

హైదరాబాద్‌: ఎంతోమంది పోరాటయోధుల ప్రాణ త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. అలాంటి త్యాగధనులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పవన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని.. రైతులు, కార్మికులతో పాటు ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందమయమైన జీవితం సాగించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను’’ అని పవన్‌ పేర్కొన్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు