Pawan Kalyan: సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన పవన్‌ కల్యాణ్‌

సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదివారం సాయంత్రం ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు...

Updated : 06 Feb 2022 21:39 IST

హైదరాబాద్‌: భిన్న మతాలు, కులాలు, సంస్కృతులకు సమతామూర్తి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. ముచ్చింతల్‌లో చినజీయర్‌ స్వామి ఏర్పాటు చేసిన సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన పవన్‌, నాదెండ్ల మనోహర్‌ ... సమతామూర్తి విగ్రహ ప్రాంగణం, యాగశాలను వీక్షించారు. అనంతరం ప్రవచన మండపంలో ఉన్న చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సమతామూర్తి విశేషాలను చినజీయర్‌ స్వామి పవన్‌కు వివరించారు. భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్‌ కల్యాణ్‌ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చినజీయర్‌ స్వామి సంకల్పంతో 216 అడుగుల భారీ విగ్రహంతో పాటు, 108 దేవాలయాలను ఏర్పాటు చేయడం హైదరాబాద్‌కు సరికొత్త గుర్తింపునిస్తుందన్నారు. రామానుజాచార్యులు జగద్గురువే కాకుండా అణగారిన వర్గాలను ఆలయ ప్రవేశం చేయించిన విప్లవకారుడని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని