Telangana news: తెలంగాణవ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల పెన్‌డౌన్‌

తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు పెన్‌డౌన్‌ పాటిస్తున్నారు. జేటీసీ రమేశ్‌పై దాడికి నిరసనగా సేవలు నిలిపివేశారు.

Updated : 28 Jun 2024 15:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు పెన్‌డౌన్‌ పాటిస్తున్నారు. జేటీసీ రమేశ్‌పై దాడికి నిరసనగా సేవలు నిలిపివేశారు. గురువారం హైదరాబాద్‌ జేటీసీపై ఆటో యూనియన్‌ నేత ఒకరు దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రవాణాశాఖ కమిషనర్‌తో చర్చల అనంతరం పెన్‌డౌన్‌ ఆలోచనను విరమించుకుని నల్లరిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. దాడికి పాల్పడిన అమానుల్లాఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని