బిహార్‌లో ఎంపీపై వరద బాధితుల దాడి

బిహార్‌లో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు సహాయక చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సివాన్‌ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన భాజపా ఎంపీ జనార్ధన్‌ సింగ్‌ సిగ్రివాల్‌పై స్థానికులు కుర్చీలతో దాడి చేశారు.

Published : 11 Aug 2020 02:11 IST

సివాన్‌: బిహార్‌లో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు సహాయక చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సివాన్‌ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన భాజపా ఎంపీ జనార్ధన్‌ సింగ్‌ సిగ్రివాల్‌పై స్థానికులు కుర్చీలతో దాడి చేశారు. సివాన్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి లక్రినాబిగజ్‌కు వచ్చిన సిగ్రివాల్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. వారిలో కొంత మంది ఎంపీ సహా ఆయనతో పాటు వచ్చిన అధికారుల పైకి కుర్చీలు విసిరారు. చాలా మంది రాజకీయ నాయకులు తమ ప్రాంతాల్లో పర్యటించినా ఎవరూ తమకు సహాయం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంత మంది ఎంపీ సిగ్రివాల్‌ను కలిసి సమస్యలు విన్నవించినా తమకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఎంపీపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. భారీ వరదల కారణంగా బిహార్‌లో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. 74లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని