
Published : 27 Dec 2021 15:05 IST
Chittoor: బ్యాంకు రుణం చెల్లించినా.. తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వడంలేదంటూ ఖాతాదారుల ఆందోళన!
చిత్తూరు: తాకట్టు పెట్టి రుణం తీసుకున్న బంగారం కనిపించడంలేదంటూ ఖాతాదారులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగిన ఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండలో జరిగింది. స్థానిక యూనియన్ బ్యాంకు శాఖ ఎదుట ఖాతాదారులు నిరసనకు దిగారు. ఆంధ్రా బ్యాంకుగా ఉన్న సమయంలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నామని వారు చెప్పారు. వడ్డీతో సహా రుణం చెల్లించినా.. తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వడంలేదంటూ ఆందోళన చేపట్టారు. బ్యాంకు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
► Read latest General News and Telugu News
ఇవీ చదవండి
Tags :