AP News: సోమశిల డ్యామ్‌ తెగిందన్న వదంతులతో జనం పరుగులు..!

సోమశిల డ్యామ్‌ తెగిపోయిందన్న వదంతులతో నెల్లూరు జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Published : 23 Nov 2021 17:08 IST

నెల్లూరు: సోమశిల డ్యామ్‌ తెగిపోయిందన్న వదంతులతో నెల్లూరు జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కోవూరు మండలంలో సాలుచింతల, స్టాబిడి కాలనీ ప్రాంతవాసులు చేతికందిన సామగ్రి తీసుకొని పరుగులు పెట్టారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలు.. సోమశిల జలాశయం తెగిందన్న వదంతులతో మరింత కంగారు పడ్డారు. వృద్ధులు, పిల్లలను తీసుకొని వీధులవెంట పరుగులు తీయడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. సోమశిల జలాశయానికి ఎలాంటి ముప్పూ లేదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరేంద్ర ప్రసాద్‌ అధికారికంగా వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అయితే వరదల సమయంలో సమాచారం ఇవ్వనందుకు అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.   
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని