బిర్యానీ కోసం కిలోమీటర్ల మేర బారులా!

ఎక్కడైనా ఉచిత వస్తువులు పంపిణీ చేస్తుంటేనో.. లేదా వస్త్ర వ్యాపారులు బట్టలపై రాయితీలు ఇచ్చినప్పుడో దుకాణాల ముందు ప్రజలు అమాంతంగా బారులు తీరడం చూసుంటాం. కానీ కర్ణాటకలోని హోస్‌కోట్‌లో ఓ హోటల్‌

Published : 12 Oct 2020 01:07 IST

బెంగళూరు: ఎక్కడైనా ఉచిత వస్తువులు పంపిణీ చేస్తుంటేనో.. లేదా నూతన వస్త్రాలపై రాయితీలు ఇచ్చినప్పుడో దుకాణాల ముందు ప్రజలు బారులు తీరడం చూసుంటాం. కానీ కర్ణాటకలోని హోస్‌కోట్‌లో ఓ హోటల్‌ ముందు బిర్యానీ కోసం భోజన ప్రియులు కిలోమీటర్ల పొడవునా బారులు తీరుతున్నారు. తెల్లవారుజామున 4గంటల నుంచి హోటల్‌  ముందు బిర్యానీ కోసం వరుసలో నిలబడుతున్నారు. అక్కడ క్యూలో ఉన్న ఓ వ్యక్తితో మాట్లాడగా.. తాను తెల్లవారుజామున 4గంటలకు క్యూలో నిలబడగా ఉదయం ఆరున్నరకు బిర్యానీ తీసుకున్నట్లు చెప్పాడు. బిర్యానీ కోసం బారులు తీరిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ దృశ్యాన్ని చూసిన వారు ఇదేమి వైపరిత్యమంటూ విస్తుపోతున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని