Colors of Eyes: ఏయే రంగు కళ్లుంటాయంటే..!
ప్రపంచవ్యాప్తంగా ఏయే రంగుల కళ్లు ఎంతమందికి ఉంటాయో.. ఓసారి లుక్కేద్దామా?
మనుసులో ఉన్నది కళ్లలో కనిపిస్తుందని అంటుంటారు. మనలోని భావాల్ని కళ్లు ప్రదర్శిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేనా.. మనలో ఆకర్షణీయంగా కనిపించే భాగాల్లో కళ్లు మొదటి వరుసలో నిలుస్తాయి. అందుకే కళ్లపై రచయితలు ఎన్నో కవితలూ, సినీ గేయాలూ రచించారు. ముఖ్యంగా నీలి కళ్లున్న వాళ్లు ఎంతో ఆకట్టుకుంటారట. మరి ప్రత్యేకంగా నిలిచేవి నీలికళ్లేనా అంటే.. కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా రంగుల కళ్లు ఉన్నాయి.
గోధుమ రంగు
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది కనుపాపలు నలుపు రంగులో ఉంటాయి. నిజానికి అది నలుపు కాదు.. గోధుమ రంగు. మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉన్నవాళ్ల కళ్లు నలుపుగా కనిపిస్తాయి. దాదాపు 70 నుంచి 79 శాతం ప్రజలకు ఈ గోధుమ రంగు కళ్లే ఉన్నాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా వాసులకు ముదురు గోధుమ రంగు కళ్లు.. దక్షిణాసియా, అమెరికా, యూరప్ ప్రజలకు లేత గోధుమ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట.
నీలి రంగు
ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మందికి నీలిరంగు కళ్లు ఉంటాయి. యూరప్‌లో.. అందులో ముఖ్యంగా స్కాండినేవియాలో వీళ్లు అధికం. కొన్ని వేల సంవత్సరాల కిందట అందరికీ గోధుమ రంగు కళ్లే ఉండేవట. ఆ తర్వాత మనుషుల జన్యువుల్లో మార్పులు వచ్చి, కనుపాప రంగు మారింది. కనుపాప రంగు పాక్షికంగా తల్లిదండ్రుల జన్యువు నుంచి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీలిరంగు కళ్లున్న వ్యక్తులు చీకటిలోనూ చూడగలరట. అయితే, పగటి పూట సూర్యకాంతిని తట్టుకోలేరని నిపుణులు చెబుతున్నారు.
లేత గోధుమ రంగు
ఆకుపచ్చ, నారింజ, బంగారు వర్ణాల కలయికతో లేత గోధుమ రంగు ఉంటుంది. ఇలాంటి కళ్లున్నవారు ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, బ్రెజిల్, స్పానిష్ ప్రజలకు ఈ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట.
అంబర్ (పసుపు, నారింజ కలయిక)
ప్రపంచ జనాభాలో 5 శాతం మందికి అంబర్ రంగు కళ్లుంటాయి. ముఖ్యంగా ఆసియా, స్పెయిన్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా వాసుల కళ్లు ఈ రంగులో ఉంటాయి. నిజానికి ఇలాంటి కళ్లు ఎక్కువగా శునకాలు, చేపలు, పక్షుల్లో ఉంటాయి.
బూడిద రంగు
పిల్లులకు ఉండే బూడిదరంగు కళ్లు ప్రపంచంలో 3 శాతం మనుషులకు ఉంటాయి. కనుపాప రంగుకు కారణమయ్యే మెలనిన్ అనే వర్ణద్రవ్యం తక్కువ మొత్తం ఉండటం, కంటిలోని స్ట్రోమా భాగంలో కొలాజిన్ ప్రొటీన్ ఎక్కువగా ఉండటంతో కనుపాప నీలిరంగులోకి మారకుండా అడ్డంకి ఏర్పడుతుందట. ఫలితంగా కనుపాప బూడిద రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు కళ్లున్నవాళ్లు ఎక్కువగా ఉత్తర, తూర్పు యూరప్‌లో ఉంటారు.
ఆకుపచ్చ రంగు
ప్రపంచ జనాభాలో 2శాతం మంది కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ యూరప్‌లో ఆకుపచ్చ కళ్లు ఉన్న వ్యక్తులు ఎక్కువ. వీరిలో 16 శాతం సెల్టిక్, జర్మన్ల వారసులై ఉంటారని అంచనా. ఐర్లాండ్, స్కాట్లాండ్లో 86 శాతం మంది నీలి, ఆకుపచ్చ రంగు కళ్లున్నవారు ఉన్నారు. అయితే, ఇక్కడ ప్రజలకు పుట్టుకతోనే ఆకుపచ్చ రంగు ఉండదట. అప్పుడే పుట్టిన శిశువు కళ్లు గోధుమ లేదా నీలి రంగులో ఉండి.. కొన్ని నెలలకు ఆకుపచ్చ రంగులోకి మారుతాయట.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
srirama chandra: సింగర్ అసహనం.. ఫ్లైట్ మిస్సయిందంటూ కేటీఆర్‌కు విజ్ఞప్తి..!
-
India News
Temjen Imna Along: ‘నా పక్కన కుర్చీ ఖాళీగానే ఉంది’.. పెళ్లి గురించి మంత్రి ఆసక్తికర ట్వీట్
-
General News
TSPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు
-
Politics News
KTR: మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు: మంత్రి కేటీఆర్
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. అక్కడ టీమ్ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్
-
Movies News
Tollywood: విజయోత్సవం కాస్తా.. వివాదమైంది.. విమర్శల పాలైంది!