చీరకట్టి.. రింగుతో చిందేసి

ఓ డ్యాన్సర్‌ చీరకట్టుతో చేసిన రింగు డ్యాన్స్‌ సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది. ఆమె స్టన్నింగ్‌ పెర్ఫార్మనెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాధారణంగా రింగుతో డ్యాన్స్......

Updated : 26 Sep 2020 09:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ డ్యాన్సర్‌ చీరకట్టుతో చేసిన రింగు డ్యాన్స్‌ సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది. ఆమె స్టన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సాధారణంగా రింగుతో డ్యాన్స్ అంటే దానికి తగిన దుస్తులు ధరిస్తారు. అయినా డ్యాన్స్‌ చేయడం కష్టమే. అలాంటిది సంప్రదాయ చీరకట్టు, రన్నింగ్‌ బూట్లతో ఆమె ప్రదర్శన‌కు నెటిజన్లు ఔరా అంటున్నారు.

డ్యాన్సర్‌ ఈష్ణ (23) హిందీ పాట ‘గెందాపూల్‌’కు చీర కట్టుతో రింగు డ్యాన్స్‌ చేసి గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కొద్దిసేపటికే ఆ వీడియో ట్విటర్‌కు చేరుకోవడంతో అది కాస్తా వైరల్‌ అయ్యింది. డ్యాన్సర్‌ స్టెప్పులకు, రింగును హ్యాండిల్‌ చేసిన విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ వీడియోను లక్షల్లో వీక్షించగా... ఆమె ప్రతిభను అభినందిస్తూ వేలమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని