Bandi Sanjay: బండి సంజయ్‌ పాదయాత్రకు అనుమతి నిరాకరణ

తెలంగాణ  అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టదలచిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు నిర్మల్‌ జిల్లా ఎస్పీ సురేశ్‌ ధ్రువీకరించారు.

Updated : 27 Nov 2022 20:40 IST

నిర్మల్:  తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టదలచిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం రోజున నిర్మల్‌ జిల్లాలోని భైంసా నుంచి సంజయ్‌ సంగ్రామ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఇటీవల పోలీసుల అనుమతి కోరారు. అయితే శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు నిర్మల్‌ జిల్లా ఎస్పీ సురేశ్‌ ధ్రువీకరించారు.

ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 15 లేదా 16 వరకు పాదయాత్ర చేపట్టాలని తొలుత పార్టీ వర్గాలు నిర్ణయించాయి. బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభించి, కరీంనగర్‌లో ముగింపు సభ నిర్వహించాలని భావించారు. ఇప్పటి వరకు 4 విడతల్లో బండి సంజయ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలో 1,178 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

బండి అరెస్టుకు పోలీసుల యత్నం

 సోమవారం చేపట్టబోయే ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్‌ నుంచి నిర్మల్‌ వెళ్తున్న బండి సంజయ్‌ను జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న  సంజయ్‌.. కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లిపోయారు. ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ కార్యకర్తలు అందోళనకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని