Telangana News: తెలంగాణలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతి

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే

Updated : 17 Jun 2022 20:08 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి. ఈపోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.

ఎస్సీ అభివృద్ధిశాఖలో 316, మహిళా శిశుసంక్షేమశాఖలో 251, బీసీ సంక్షేమశాఖలో 157,  గిరిజన సంక్షేమశాఖలో 78, దివ్యాంగశాఖలో 71, జువైనల్‌ వెల్ఫేర్‌లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా శిశుసంక్షేమశాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా అనుమతితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్యోగాల భర్తీ అంశాన్ని ట్విటర్‌ ద్వారా ఆర్థికమంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కొందరు చేసే ఉద్యోగాల ప్రకటనలు జుమ్లా మాత్రమేనన్న హరీశ్‌రావు.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చినట్టు పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని