Published : 02 Jul 2022 17:10 IST

Telangana News: తెలంగాణలో మరో 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి

హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో 1,663 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో ఇంజినీరింగ్‌ పోస్టులు 1,522 ఉన్నాయి. నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ శాఖల్లోని 1,522 ఇంజినీరింగ్‌ పోస్టులు సహా 1663 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అనుమతిచ్చిన వాటిలో నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ పోస్టులు, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భూగర్భ జలశాఖలో 88 పోస్టులు, రోడ్లు భవనాలశాఖలో 38 సివిల్ ఏఈ పోస్టులు, 145 సివిల్ ఏఈఈ పోస్టులు, 13 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు,  27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆర్థికశాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మిగిలిన పోస్టుల భర్తీకి కూడా అనుమతుల ప్రక్రియను ఆర్థికశాఖ ముమ్మరం చేసింది. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి కూడా అనుమతులు ఇవ్వనున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts