TS News: మ‌రో 5 ఆస్ప‌త్రుల అనుమ‌తుల ర‌ద్దు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ చికిత్స‌ల‌కు సంబంధించి ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో

Updated : 30 May 2021 13:15 IST

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ చికిత్స‌ల‌కు సంబంధించి ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో తాజాగా 27 ఆసుప‌త్రుల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయ‌డంతో పాటు ఐదు ఆస్పత్రుల‌కు కొవిడ్ చికిత్స అనుమ‌తులు ర‌ద్దు చేసింది. అమీర్‌పేట్ ఇమేజ్ ఆస్ప‌త్రి, ఎల్‌బీ న‌గ‌ర్‌లోని అంకుర, కొండాపూర్‌లోని సియాలైఫ్‌, షాపూర్‌న‌గ‌ర్‌లోని సాయి సిద్ధార్థ‌, భూత్‌పూర్‌లోని పంచ‌వ‌టి ఆస్ప‌త్రుల అనుమ‌తి ర‌ద్దు చేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం రాష్ట్రంలో 10 ఆస్ప‌త్రుల ర‌ద్దు చేసిన‌ట్లు అయింది.  ఇటీవ‌లే ఐదు ఆస్ప‌త్రుల అనుమ‌తుల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం.. 64 ద‌వాఖానాల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని