Personality Tips: ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈస్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌! ఈ సూత్రం పాటిస్తున్నారా!

ఫస్ట్‌ ఇంప్రెషన్ ఈస్‌ బెస్ట్‌ ఇంప్రెషన్ అంటారు. నిజమే మనం ఎవరినైనా కలిసినప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లినా, పెళ్లి చూపుల్లో ఈ సూత్రం వర్తిస్తుంది. మొదటిసారి ఎదురయ్యే అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Published : 29 Sep 2022 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫస్ట్‌ ఇంప్రెషన్  బెస్ట్‌ ఇంప్రెషన్ అంటారు. నిజమే మనం ఎవరినైనా కలిసినప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లినా, పెళ్లి చూపుల్లోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. మొదటిసారి ఎదురయ్యే అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఎదుటి వారిని మెప్పించేలా.. ప్రత్యేక గుర్తింపు సాధించాలంటే ఏ విధంగా ప్రవర్తించాలి. ఎలా మాట్లాడాలో తెలుసుకోండి!

మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి..
కాలేజీలో అయినా, కార్యాలయంలో అయినా తోటివారితో మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి. ఎదుటివారు మాట్లాడితేనే నేను మాట్లాడుతాను. నేనే ముందు ఎందుకు మాట్లాడాలనే భావం వద్దు. 

నవ్వుతూ పలకరించండి:
ఎప్పుడూ ముభావంగా, అసహనంగా ఉంటే సహోద్యోగుల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడదు. తోటివారితో సాధ్యమైనంత మేరకు నవ్వుతూ పలకరించడం నేర్చుకోండి. 

సహకరించండి!
ఇతరులకు ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయండి. దీంతో బంధాలు బలపడతాయి. మీకు ఏదైనా సహాయం కావాలంటే ఇతరులను అడగండి. 

కరచాలనం.. 
షేక్‌ హాండ్‌ ఇవ్వటం వల్ల ఇతరులకు మనం గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. పరిచయం చేసుకునే ముందు, వెళ్లిపోయేటప్పుడు కూడా కరచాలనం చేయటం మంచి అలవాటు. దీంతో మనసులోని భావాలను వ్యక్తీకరించినట్లు ఉంటుంది. 

స్పష్టంగా మాట్లాడండి.
చిన్నగా మాట్లాడితే ఎదుటివారికి మీరు చెప్పేది అర్థం కాకపోవచ్చు. గట్టిగా మాట్లాడినా కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా సాధారణంగా మాట్లాడండి. చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ మాట్లాడండి. 

డ్రెస్సింగ్‌ విషయంలో జాగ్రత్త..
బట్టలు ఎదుటివారిని మెప్పించడానికి వేసుకోకూడదు. కానీ మనం వేసుకునే బట్టల తీరును బట్టి ఎదుటివారు మన మీద ఓ అభిప్రాయాన్ని ఏర్పచుకుంటారు. మీ హుందాతనాన్ని కాపాడుకునేటట్లు డ్రెస్సింగ్‌ చేసుకోవటం మంచి పద్ధతి. బట్టలు అనగానే రకరకాల ఆలోచనలు మెదులుతుంటాయి. ఎక్కువ ధర బట్టలు వేసుకోవాలని కాకుండా మన వ్యక్తిత్వాన్ని తెలియజేసేలా డ్రెస్సింగ్‌ చేసుకోవటం ముఖ్యం. 
 

సమయపాలన..
సమయపాలన.. మనం చేసే పనికి మనం ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. ఏ పని చేయాలని నిర్ణయించుకున్నా, ఎవరినైనా కలవాల్సి వచ్చినా నిర్ణీత సమయాని కన్నా ముందే వెళ్లడం మంచి లక్షణం. 

మీపై మీకు నమ్మకం ఉండేలా..
 మీరు ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉండండి. తప్పైనా, ఒప్పైనా  మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి. కానీ మీ వాదనే నిజమనే భావజాలం మిమ్మల్ని చిక్కుల్లో పెడుతుంది. 

ఫోన్లు చూడకూడదు..

ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు దిక్కులు చూడటం, ఫోన్లు చూసుకోవటం వంటి పనులు చేయకూడదు. దీనివల్ల ఎదుటివారు చెప్పాలనుకున్న విషయం చెప్పలేరు. మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. 


 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts