జగన్‌పై కేసు ఉపసంహరణ కోసం పిటిషన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు ఉపసంహరణ కోసం కోదాడ పోలీసులు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి

Published : 12 Feb 2021 19:33 IST

కోదాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు ఉపసంహరణ కోసం కోదాడ పోలీసులు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు ఉపసంహరణ కోసం కోర్టు అనుమతి కోరారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 2014లో జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోదాడ కోర్టులో ఏ-2 నిందితుడు నాగిరెడ్డి, ఏ-3 నిందితుడు వైవీ రత్నంపై కేసు వీగిపోయిందని పోలీసులు తెలిపారు. దీనిపై జగన్‌కు ఇంకా సమన్లు ఇవ్వలేదని పిటిషన్‌లో తెలిపారు. పిటిషన్ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఫిర్యాదు చేసిన ఎంపీడీవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి హాజరుకావాలని ఆదేశించింది.అనంతరం విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి
మూడో దశ.. ఏపీలో ఏకగ్రీవాల జోరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని