Pinnelli: దర్యాప్తు అధికారులను మార్చాలి: హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్‌

ఎన్నికల సందర్భంగా తనపైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 30 May 2024 18:17 IST

అమరావతి: ఎన్నికల సందర్భంగా తనపైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను అనుమతించిన న్యాయస్థానం విచారణ జరిపింది. దర్యాప్తు అధికారులు తనను టార్గెట్‌ చేస్తున్నారని పిన్నెల్లి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వినతిపై శుక్రవారానికల్లా నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దర్యాప్తు అధికారులతో పాటు ఐజీని కూడా మార్చాలని  పిన్నెల్లి పిటిషన్‌లో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు