Lockdown: వాడిపోతున్న వ్యాపారాలు

లాక్ డౌన్ కారణంగా చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రయవిక్రయాలకు 4 గంటల సమయం ఇస్తున్నా కూరగాయల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది.

Published : 29 May 2021 22:48 IST

హైదరాబాద్‌: లాక్ డౌన్ కారణంగా చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్రయవిక్రయాలకు 4 గంటల సమయం ఇస్తున్నా కూరగాయల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉదయాన్నే కొనుగోలుదారులు రాకపోవడంతో కరీంనగర్ మార్కెట్‌లో కూరగాయలు చెడిపోతున్నాయని వాపోతున్నారు. కఠిన నిబంధనల అమలుతో వ్యాపారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం కూరగాయల రైతులు, విక్రయదారులపై పడుతుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ ఆంక్షలు సడలించినా కొనుగోలు దారులు 8 గంటల తర్వాతే వస్తున్నారని చెబుతున్నారు. పోలీసులు 9:30 గంటలకే దుకాణాలు మూసివేయిస్తుండగా, కూరగాయలు అమ్ముడుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి ఎక్కువ ధరకి కూరగాయలు తీసుకువచ్చి విక్రయాలు జరగక పారేస్తున్నామని వాపోతున్నారు. మరో రెండు గంటల సమయం ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని