samosas: సమోసాలకు సీరియల్ నంబర్లు ఎప్పుడైనా చూశారా?
సమోసాలపై సీరియల్ నంబర్లు ముద్రించి ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సమోసాలకు ఎంతో క్రేజ్ ఉంది! గరం గరం సమోసాను చూస్తేనే చాలామంది లొట్టలేస్తుంటారు. మరి ఆ సమోసాలకు సీరియల్ నంబర్లు ఉంటే? ఏంటీ.. వాటికి సీరియల్ నంబర్లా.. అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఇది నిజమే. తాజాగా సమోసాలపై సీరియల్ నంబర్లు ముద్రించి ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ట్విటర్ యూజర్ నితిన్ మిశ్రా వాటిని తన ఖాతాలో షేర్ చేశారు. ‘నేను ఆర్డర్ చేసిన సమోసాలకు సీరియల్ నంబర్లు ఉన్నాయి’ అని వ్యాఖ్యను జతచేశారు. దీంతో ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే 12వేలకు పైగా లైక్‌లతోపాటు రీట్వీట్లు వస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఒకింత విస్మయానికి గురవుతున్నారు! అంతేకాకుండా ఈ పోస్టుకు సరదా కామెంట్లూ చేస్తున్నారు. ‘ఇలాంటి పాత కాలపు సమోసాలను కొనడం మానేయండి. క్యూఆర్ కోడ్‌తో ఉన్నవాటినే కొనుగోలు చేయండి’ అని ఒకరు, ‘ఇక రసగుల్లాలపై క్యూఆర్ కోడ్ వేస్తారని భయంగా ఉంది’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్పండంటూ పలువురు ఆయనకు మెసేజ్‌లు చేసి అడుగుతున్నారు. దీనికి సమాధానంగా ‘వీటి గురించి మెసేజ్ చేయడం ఆపండి. ‘సమోసా పార్టీ’లో ఆర్డర్ చేసుకోండి’ అంటూ మరొక ట్వీట్ చేశారు. కాగా.. ‘సమోసా పార్టీ’ బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ. ఇందులో వెరైటీ సమోసాలను తయారు చేస్తుంటారు. బెంగళూరుతోపాటు గురుగ్రామ్‌లోనూ ఇవి లభిస్తాయి. అక్కడ సమోసాలపై వేర్వేరు సీరియల్ కోడ్లను స్టాంప్ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్‌కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ