Pineapple: అనాసతో అంతా మేలే!

ఆరోగ్యంగా ఉండాలంటే చాలామంది రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. అంత హంగామా ఏం అవసరం లేదు. మనకు అందుబాటులో ఉండే వాటిల్లోనే ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. అలాంటి పోషకాల గని అనాసపండు. మరి దీంతో మనకు కలిగే ప్రయోజనాలేంటో చూడండి.

Published : 19 Oct 2022 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోషకాలున్న అనాస తింటున్నారా! శరీరానికి ఎంతో మేలు చేసే ఈ పండును మీ రోజు తినే ఆహారంలో భాగం చేసుకోండి. దీనివల్ల ఎన్ని  ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. 

* తక్షణ శక్తిని అందించడంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది. 
* ఇందులో ఉండే విటమిన్‌ సీ, యాంటీ ఆక్సీడెంట్లు, ఫైబర్‌ శరీర పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడుతాయి. 
* ఇందులో ఉండే మాంగనీసు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. 
* ఏదైనా దెబ్బ తగిలి గాయాలైతే తొందరగా కోలుకునేందుకు సహాయపడుతుంది. 
* ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
* జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. 
* సహజంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. 
* రోజూ ఓ గ్లాసు పైనాపిల్ రసాన్ని తాగటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 
* పైనాపిల్‌ను ముక్కలుగా చేసుకుని కూడా తినేయచ్చు. దీంతో పైనాపిల్‌లో ఉండే ఫైబర్ కూడా శరీరానికి అందుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని