TS news: ఇది ధర్మాసనంపై దాడే: హైకోర్టు

ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ఇచ్చిన జీవో 34పై కృష్ణా జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ రామచంద్రారావు, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది...

Updated : 05 Jul 2021 16:11 IST

హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో విద్యుదుత్పత్తి ఆపాలంటూ కృష్ణా జిల్లా రైతులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ ఇచ్చిన జీవో 34పై వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ రామచంద్రారావు, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పిటిషన్‌ను సీజే ధర్మాసనం ముందుంచాలని తెలంగాణ ఏజీ ప్రసాద్‌ కోరారు. విచారణ జరపాలని సీజే తమను ఆదేశించారని ధర్మాసనం పేర్కొంది. ఏజీ స్థాయి అధికారి నుంచి అసమంజస అభ్యర్థన సరికాదని పేర్కొంది. సీజే ధర్మాసనం ఎదుట విచారించాలనడం తమ ధర్మాసనంపై దాడేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అని ప్రశ్నించింది. రాజోలిబండ ప్రాజెక్టుపై సుప్రీం తీర్పును అధ్యయనం చేయాలని సూచించింది. దీనిపై రేపు వాదనలు వినిపించాలని పిటిషనర్‌, కేంద్రం, తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. తెలంగాణ చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తి ఇంధనశాఖ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని కృష్ణా జిల్లా రైతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వాడొద్దని అభ్యంతరం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని