Updated : 04 Jul 2022 11:45 IST

PM Modi: గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం

గన్నవరం: ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌తో పాటు పలువురు భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు.

గన్నవరం నుంచి ప్రధాని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బయల్దేరి వెళ్లారు. అక్కడ నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో ప్రధానితో పాటు గవర్నర్‌, సీఎం పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం పెద అమిరంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని