కామారెడ్డి రోడ్డు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. రూ.2లక్షల పరిహారం ప్రకటన

కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Updated : 09 May 2022 09:58 IST

హైదరాబాద్‌: కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు సంతాపం తెలిపిన ఆయన.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం ప్రకటించారు. ఎల్లారెడ్డి పీఎస్‌ పరిధిలోని హసన్‌పల్లి గేటు వద్ద నిన్న సాయంత్రం టాటా ఏస్‌ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. వాహనంలో 25 మంది ప్రయాణిస్తుండగా, వారిలో తొమ్మిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని