
Modi Wishes: అభిమానిని ఆశ్చర్యపరిచిన మోదీ!
ఊహించని స్పందనకు మహిళ ఆనందం
దిల్లీ: ప్రతినిమిషం అధికారిక కార్యకలాపాల్లో ఎంతో బిజీగా ఉండే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తన అభిమానిని ఆశ్చర్యానికి గురిచేశారు. Dextro అనే పేరుతో ట్విటర్‌లో అకౌంట్ ఉన్న ఒక మహిళకు తన స్నేహితుడు (అజిత్ దత్తా) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు తన మిత్రుడికి ధన్యవాదాలు తెలిపిన మహిళ.. ప్రధానమంత్రి మోదీ గారిని నాకు శుభాకాంక్షలు తెలపమని చెప్పండి అంటూ మిత్రుడిని సరదాగా అడిగింది. తన మిత్రులు ప్రధానమంత్రిని ట్విటర్‌లో ఫాలో అవుతున్నందున ఆమె అలా కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె అలా సరదాగా కోరిన కోరికకు ప్రధాని నుంచి ఊహించని రిప్లై వచ్చింది.
ఆ మహిళకు నిజంగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రధాని మోదీ నుంచి వచ్చిన రిప్లైకి ఆ మహిళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నేనెంతో అదృష్టవంతురాలిని అని ట్విటర్‌లో సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.