సీజేఐని కలిసిన తెలుగు కవులు, రచయితలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణను తెలుగు కవులు, రచయితలు తెలంగాణ రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్, సినీ గేయ రచయితలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సుద్దాల..

Updated : 16 Jun 2021 19:05 IST

హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణను తెలుగు కవులు, రచయితలు తెలంగాణ రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్, సినీ గేయ రచయితలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సుద్దాల అశోక్ తేజ, కవి ఎన్ గోపి, ఎమెస్కో అధినేత విజయ్‌ కుమార్ సహా పలువురు రచయితలు, కవులు జస్టిస్‌ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన సీజేఐని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. తెలుగును ఎంతో అభిమానించే జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిందని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సీజేఐ చేసిన సేవలను బుద్ధ ప్రసాద్ కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని