Polavaram: బ్యాక్ వాటర్‌పై మరోసారి ఉమ్మడి సర్వే.. తెలంగాణ డిమాండ్‌కు అంగీకరించిన ఏపీ
పోలవరం బ్యాక్ వాటర్స్‌పై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్ర జలశక్తి సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఉమ్మడి సర్వే, బ్యాక్ వాటర్స్ ప్రభావిత రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. అభ్యంతరాలపై టెక్నికల్ డేటాను ఈనెల 19లోగా ఇవ్వాలని కేంద్ర జలసంఘం ఆదేశించింది.
అమరావతి: పోలవరం బ్యాక్ వాటర్‌పై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పోలవరం బ్యాక్ వాటర్ పై కేంద్ర జల శక్తిశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాంకేతిక కమిటీ సమావేశం దిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఇంజినీరింగ్ అధికారులు హాజరయ్యారు. గోదావరి ప్రవాహానికి అనుకూలంగా స్పిల్ వే డిజైన్‌తో పాటు 3 రాష్ట్రాలపై బ్యాక్ వాటర్ ప్రభావం, గోదావరి జలవివాదం ట్రైబ్యునల్ అవార్డు తదితర అంశాలపై చర్చించారు. గరిష్ఠ వరద కారణంగా వచ్చే బ్యాక్ వాటర్ వల్ల ముంపు సమస్య ఏర్పడుతుందని 3 రాష్ట్రాలు చేసిన వాదనలు వినిపించగా.. కేంద్ర జలసంఘం వాటిని తిరస్కరించింది.
68లక్షల క్యూసెక్కుల గరిష్ఠ వరద వచ్చే అవకాశం ఉందని, స్పిల్‌వే డిజైన్లపైనా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు అనుమానం వ్యక్తం చేశాయి. కేంద్ర జలశక్తిశాఖ , ఏపీ సంయుక్తంగా నిర్వహించిన బ్యాక్ వాటర్ సర్వే ఏపీకి మాత్రమే అనుకూలంగా ఉందని ఒడిశా ఆరోపించింది. బ్యాక్‌వాటర్ అంచనాపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని.. ఉమ్మడి సర్వే తమకు సమ్మతం కాదని ఒడిశా ఇంజినీర్లు పేర్కొన్నారు. తెలంగాణ కూడా బ్యాక్ వాటర్‌పై అధ్యయనం కోసం కొత్తగా సర్వే చేపట్టాలని కోరింది. పాత గణాంకాల ఆధారంగా మాత్రమే కేంద్ర జలసంఘం నివేదిక రూపొందించిందని తెలంగాణ ఇంజినీర్లు ఆక్షేపించారు. 2022లో వచ్చిన గోదావరి వరద కారణంగా 28వేల ఆవాసాలు మునిగిపోయినట్టు తెలంగాణ పేర్కొంది. వరద నీరు నిలిచిపోవడంతోనే తెలంగాణలో ఉన్న 7మండలాలు, 50వేల ఎకరాలు, 150గ్రామాలు కూడా ముంపునకు గురయ్యాయని గుర్తు చేసింది. ఈవిషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ కూడా గుర్తించిందని పేర్కొంది. గోదావరి అనుబంధ నీటివనరులపైనా ఉమ్మడి సర్వేకు సిద్ధమని తెలంగాణ తెలిపింది. దీంతో ఉమ్మడి సర్వే, బ్యాక్ వాటర్ ప్రభావిత రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలకు ఏపీ అంగీకరించింది. అభ్యంతరాలపై టెక్నికల్ డేటాను ఈనెల 19లోగా ఇవ్వాలని కేంద్ర జలశక్తిశాఖ ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీలో మహిళలు, చిన్నారులు బుధవారం ఆందోళన నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
రాజధాని అమరావతి (Amaravati)నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. -
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్‌పేట్ సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. -
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
శ్రీరామ నవమి (Sri Rama Navami)ని పురస్కరించుకుని భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్) వేదికగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.