Telangana news: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది...

Updated : 25 Apr 2022 19:04 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి పెద్ద మొత్తంలో పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో పెద్ద ఎత్తున సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 16,027 కానిస్టేబుల్‌, 587 ఎస్‌ఐ, 414 సివిల్‌ ఎస్‌ఐలు, 66 ఏఆర్‌ ఎస్‌ఐ, 5 రిజర్వ్‌ ఎస్‌ఐ, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ, 12 ఎస్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విపత్తు, అగ్నిమాపక శాఖలోనూ 26 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, 8 డిప్యూటీ జైలర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో అత్యధికంగా టీఎస్‌ఎస్‌పీలో 5,010, సివిల్‌లో 4,965, ఏఆర్‌లో 4,423 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక, జైళ్ల శాఖ, ఐటీ విభాగంలోనూ పలు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హతలున్న అభ్యర్థులను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు శ్రీనివాస్ రావు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని