రెయిడ్స్‌కు ముందు.. తర్వాత.. కవితకు మద్దతుగా పోస్టర్లు.. ఫ్లెక్సీలు..

ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరవుతుండగా ఆమెకు మద్దతుగా హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.  రెయిడ్స్‌కి ముందు తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఇవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Updated : 11 Mar 2023 13:00 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరవుతుండగా ఆమెకు మద్దతుగా హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. భాజపాలో చేరకముందు.. చేరిన తర్వాత.. అంటూ పలువురు భాజపా నేతల ఫొటోలతో నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకొని భాజపాలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలతో విమర్శలు కురుస్తున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పశ్చిమ బెంగాల్ భాజపా ముఖ్యనేత సువేందు అధికారి, ఏపీకి చెందిన భాజపా నేత సుజనా చౌదరి, కేంద్ర మంత్రి నారాయణ్ రాణెతో పోలుస్తూ.. రెయిడ్స్‌కి ముందు తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు నగరంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇక, మోదీని విమర్శిస్తూ కూడా పోస్టర్లు దర్శనమిచ్చాయి. మోదీని రావణాసురుడితో పోలుస్తూ.. సీబీఐ, ఈడీ, ఐటీ, ఈసీ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ఈ పోస్టర్లను రూపొందించారు. ‘‘ప్రజాస్వామ్య విధ్వంసకారుడు’’ అంటూ వాటిపై రాసుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని