Food: వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. లావైపోతారు!

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు.. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వివిధ సందర్భాల్లో ఫొటోలు, సెల్పీలు దిగి వాటిని పోస్టు చేస్తూ ఉంటారు. అలాంటి వారు మన చుట్టూ చాలా మందే కనిపిస్తారు. అయితే, తినే ఆహారాన్ని ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేసే వారిలో ఆకలి తీవ్రత అధికంగా

Published : 21 Oct 2021 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు.. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వివిధ సందర్భాల్లో ఫొటోలు, సెల్పీలు దిగి వాటిని పోస్టు చేస్తూ ఉంటారు. అలాంటి వారు మన చుట్టూ చాలా మందే కనిపిస్తారు. అయితే, తినే ఆహారాన్ని ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేసే వారిలో ఆకలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అలా అధికంగా తింటూ ఊబకాయులుగా మారే అవకాశముందని తాజాగా జార్జియా  యూనివర్సిటీ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.

21వ శతాబ్దంలో జన్మించిన వారిలో 70శాతం మంది.. వారు ఏం తింటున్నా.. వాటిని ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారట. అలా ఫొటోలు తీసి పోస్టు చేస్తూ తింటుండటంతో వడ్డించిన ఆహారం ఎంత బాగున్నా.. సరిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఫొటోల సంబరంలోపడి మొదటి సారి వడ్డించిన ఆహారంతో తృప్తి, తిన్న భావన కలుగక.. రెండోసారి వడ్డించుకుంటున్నారు. దీంతో బరువు పెరుగుతున్నారట. ఈ సర్వే కోసం యూనివర్సిటీ పరిశోధకులు కొంతమంది విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించి ఆహారం పెట్టారు. ఒక గ్రూపును కేవలం ఆహారం తినమని.. మరో గ్రూపును సోషల్‌మీడియాలో ఫొటోలు పెట్టి తినమని చెప్పారు. అనంతరం ఆహారం ఎంత రుచిగా ఉంది..? మరింత తినాలని ఉందా? అని ప్రశ్నించారు. మొదటి గ్రూపువారు కడుపు నిండిందని చెప్పగా.. రెండో గ్రూపు వ్యక్తులు మాత్రం మరింత తినాలనిపిస్తోందని చెప్పారు. తీసే ఫొటోల్లో ఆహారం ఆకర్షణీయంగా కనిపిస్తూ ఇంకా ఇంకా తినాలనిపించేలా చేస్తుందట. అలా మితంగా తినాల్సిన ఆహారం.. మితిమీరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. జాగ్రత్త పడకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని