AndhraPradesh : ఏపీలో పలు చోట్ల అంధకారం.. రెండు గంటలకుపైగా నిలిచిన విద్యుత్‌ సరఫరా

ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరుతో పలు ప్రాంతాల్లో అధికారులు కోతలు

Updated : 03 Feb 2022 21:57 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరుతో పలు ప్రాంతాల్లో అధికారులు కోతలు విధిస్తున్నారు. కాకినాడలో గత రెండు గంటలుగా విద్యుత్‌ సరఫరా నిలిచింది. కాకినాడ జీజీహెచ్‌ మినహా మిగతా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. అమలాపురం డివిజన్‌, తుని, సీతానగరంలో  2 గంటలుగా విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. రామచంద్రాపురం డివిజన్‌లోనూ, తొండంగి, అనపర్తి, పెద్దాపురంలో సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. చీరాలలో సాయంత్రం 6.30 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచింది. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గింది. వీటీపీఎస్‌, ఆర్‌టీటీపీ,  కృష్ణపట్నం కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు విద్యుత్ కేంద్రాల్లో కలిపి 1,700 మెగావాట్ల వరకు తగ్గింది. దీంతో మూడు డిస్కంలయ పరిధిలో విద్యుత్‌ కోతలను అధికారులు విధిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు