AP News: కోనసీమలో ప్రభల తీర్థం ఉత్సవాలు.. ఆకట్టుకున్న బాణసంచా వెలుగులు

తూర్పు గోదావరి జిల్లాలో ప్రభల తీర్థం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కొత్తపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రభల తీర్థం వేడుకను శనివారం  స్థానిక ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు.

Published : 16 Jan 2022 03:43 IST

కొత్తపేట: తూర్పు గోదావరి జిల్లాలో ప్రభల తీర్థం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కొత్తపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రభల తీర్థం వేడుకను శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ప్రభలను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తీర్థ మహోత్సవాన్ని వీక్షించేందుకు పరిసర  ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. దీంతో కొత్తపేట జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. ప్రభల తీర్థంలో రాత్రంతా బాణసంచా కాల్చడం ఆనవాయితీ.  ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో ఎస్సై మణికుమార్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నియంత్రించారు. కొత్తపేట బోడిపాలెం వంతెన వద్ద నుంచి వాహనాలను గ్రామంలోకి రానీయకుండా దారి మళ్లించి ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని